స్థిత ప్రజ్ఞత


తెలుగు బ్లాగు పాఠకులందరికి నమస్సుమాంజలి!!!!!


దాదాపు ఆరు నెలల తర్వాత మళ్ళీ మదిలోని భావతరంగం తో మీ ముందుకు.......

ఇప్పుడు నేను చెప్పబోయేది అందరికి తెలిసిందే......
అందరూ చెప్పేదే కాని ..... ఇది నేనిచ్చే అక్షర రూపం....

సుఖం- దుఃఖం సంతోషం-విచారం కవలల్లాంటివి.ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి, ఏ ఒక్కటీ ఎల్లకాలం ఉండవు. మనం ఆశించినవన్నీ యథాతథంగా జరుగుతున్నప్పుడు సుఖంగా, సంతోషంగా ఉంటాం. కొత్త ఆశలు చిగురిస్తాయి. ఏ కొన్ని జరగకపోయినా దుఃఖం కమ్మేస్తుంది, విచారం ఆవహిస్తుందిమళ్ళీ ఆశలు..... , నిరాశలు.... ఇదొక చక్రం. ఏది ఎంతకాలం ఉంటుందో ఊహించలేము అలా అని నియంత్రించలేము.

మరి ఎలా???

మరో చిత్రం ఏంటంటే మనం విచారంగా ఉన్నప్పుడు "ఎందుకు నాకే ఇలా  జరుగుతోందీ... ఎప్పుడూ ఇంతే" అనుకుంటాము. అదే పట్టరాని సంతోషం కల్గినప్పుడు కూడా "అరే  నాకే ఇలా జరిగిందే" అని అనుకుంటామా ...
లేదే  .అదీ మనిషి స్వభావం. ఎందుకీ భేదం???

 అందుకే రెంటిని సమానం గా తీసుకోగల్గినపుడు మనకు ఏ ఒత్తిడి ఉండదు. ఏ దుఃఖం బాధించదు. భగవద్గీత లో శ్రీ కృష్ణుడు చెప్పినట్టుగా కర్మ చేయడం వరకే మన వంతు. దాని ఫలితం ఆశించడం, ఊహించడమే దీనికి మూలం.అది ఎలా ఉండాలో అలా ఉండి తీరుతుంది.

తామరాకు మీద నీటి బొట్టు లా, దేనిని గ్రహించని పాదరసంలా మనసుని
నిగ్రహించగల్గితే,  స్థిత ప్రజ్ఞత సాధించితే......బాధ ,దుఃఖం,విచారం దరి చేరనే
చేరవు.

చెప్పటం చాలా సులభం....  కాని ఆచరణ నిరంతర ప్రయత్నం తోనే సాధ్యం.!!!
2 comments:

  1. బాగా చెప్పేరు.... జీవిత మనే కావడిలో కష్ట సుఖాలు రెండూ ఉంటాయి...ఉండాలి కూడా....

    ReplyDelete
  2. అవును..... శర్మ గారు ధన్య వాదములు!!!

    ReplyDelete

హృదయాన్ని స్పృశించే పాట

రంగస్థలం సినిమా ఎలా ఉన్నా ఈ పాట మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. చంద్రబోస్ కలం నుంచి జాలువారిన మరో అద్భుతం.  చెట్టంత ఎదిగిన కొడుకు మరణిస్తే ...