తొలి పరిచయం

ఏదో రాసేయాలని మనసుకి చేతికి ఉన్న ఆరాటం ,ఉబలాటం ఇన్నాళ్ళకి తీరుతోంది. ఇంతకు ముందు కొన్ని చిన్న చిన్న కథలు కవితలు యాత్రా విశేషాలు రాసిన పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఈ జయ నామ సంవత్సరం సందర్భంగా ఒక బ్లాగ్ చేసుకొనిఅందులో నాకిష్టమైనవన్ని  రాయాలని   అనుకొన్నదే ఈ ప్రయత్నం.

రాయాలనుకున్నాను  సరే బానీ వుంది కాని ఏం రాయలి ఎలా రాయలి అని తీవ్రంగాఆలోచించాను . ఆప్పుడప్పుడు   మన నిజ జీవితం లో జరిగే కొన్ని సంఘటనలు  కథా వస్తువులవుతుంటాయి  దీన్ని ఈలాగే కథ రాయలని అనుకొంటాం అవి రాయనా?? లేక చాలా ఖాళీగా వుండటం  వల్ల మనసులో రేగే అలోచనలనే   రాయనా?? ఇదీ సమస్య !!!

లేక ఈ మధ్యనే మళ్ళీ  మొదలు పెట్టిన సుందరాకాండ  గ్రంధం లోని వాల్మీకి వర్ణనా వైభవం గురించి రాయనా?? ఛదివినా కొద్దీ చదవాలనిపిస్తుంది. ఊహకు కుడా అందని  ఉపమనాలు , అలంకారాలు మనసుకు హత్తుకుకునేలా వుంటాయి ఈ  మధురమైన గ్రంధం లో.

నిజం చెప్పాలంటే ఈ పుస్తకం చదివినతర్వాత నాకు రావణుడంటే విపరీతమైన అభిమానం, గౌరవం , ఇష్టం పుట్టుకొచ్చాయి .ఆ లంకా నగర వైభవం రావణుడి విగ్రహం, ఆతని యశస్సు ,వర్చస్సు, వైభోగం  గురించి వివరించిన  తీరు అమోఘం.

నా వరకైతే నేను కూడ సూక్ష్మ రూపధారినై  హనుమ పక్కనే ఆ సమయం లో అక్కడ వుండి ఆ వజ్ర ,వైఢూర్య,   స్వర్ణ , రజిత వివిధ మణిమయ భూషితమైన ఆ నగరాన్ని విశ్వకర్మ  విశిష్ట సృష్టి  లొ భాగమైన పుష్పక విమానాన్ని , రావణ బ్రహ్మ యొక్క కోమలమైన వారు ,ముగ్ధమనోహరమైన వారు, సదా అతన్ని అనుసరించు వారు అయిన సతులనీ ,వారందరికి వన్నె తెచ్చే సదాచార సంపన్నురాలు, పతిహితము కొరేది,పట్టామహిషి అయిన మండోదరిని, రాక్షసులలో జన్మించినా త్రికాల కర్మలు ఆచరిస్తూన్నవారిని,  వేదకోవిదులని   ఆహా!! ఒక్కసారి చూసివుంటే బాగుండేదని  అనిపిస్తుంటుంది.

ఇదేంటి రామాయణం లో రాముడు సుందరాకాండ లో హనుమ కదా హీరోలు !! విలన్ని ఇష్టపడటం ఏంటీ సైకో నా అని నలుగురూ నవ్వుకోగాక!!(ఈ కాండ లో రాముడికి పెద్ద రోల్ లేదులే మిగిలిన కాండలు చదివినప్పుడు చూద్దాం).


సరే మళ్ళీ బాక్ టు టాపిక్. ఏం  రాయాలని కదా సందేహం ??  రాయడానికి పెద్దవి లోతైనవి,మాత్రమే  కాదు చిన్న  చిన్న విషయలు కూడ రాయొచ్చు . ఉదాహరణకు
ఇంద్రధనుస్సు లాంటి రంగులతో మెరిసిపోతున్న సీతాకోక చిలక తనలాంటి

వర్ణాలతో మెరిసిపోతున్న కుసుమముపై మకరందం కోసం సుతారంగా వాలింది అని వర్ణిస్తుంటారు. విమర్శకులు సీతాకోక చిలక పువ్వు పై ఆహారం కోసం వాలటం సృష్టి ధర్మం కదా అందులో ఏముందీ??? అదే కాండం పై నో ఆకు పై నో వాలితే విశ్రాంతి కోసం అని అది కూడా రాయాలా అని విమర్శిస్తుంటారు.


సరే మరో ముఖ్య విషయం సడెన్ గా ఈ రాసే పని ఇలా వర్క్ అవుట్  అవుతుందేంటి అని కారణాలకోసం అన్వేషించా ఒకటేంటంటే 2014 నా జాతకం లొ ప్లూటొ మరియు వీనస్ లు

క్రియేటివిటి జోన్ లో వున్నవి అవి ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ లో మాష్టర్ ని చేస్తాయి అని

వుంది బహుశా అందుకే కాబోలు ఈ తాపత్రయం అనుకున్న !!

సరే మరి ఏం రాయలో నిర్ణయించుకొని మంచి టాపిక్ తో ముందుకొస్తా ........


                                                                     అప్పటివరకు సెలవు

2 comments:

హృదయాన్ని స్పృశించే పాట

రంగస్థలం సినిమా ఎలా ఉన్నా ఈ పాట మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. చంద్రబోస్ కలం నుంచి జాలువారిన మరో అద్భుతం.  చెట్టంత ఎదిగిన కొడుకు మరణిస్తే ...